: పుజారా, అశ్విన్ కు కెరీర్ బెస్ట్ ర్యాంకులు
ఆసీస్ పై ఉత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకుల్లో మరింత మెరుగయ్యారు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్ జాబితాలో పుజారా 12 స్ఝానాలు ఎగబాకి 11 వ స్థానానికి చేరుకున్నాడు. పుజారాకు ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ర్యాంకు. ఇక బౌలర్ల జాబితాలో అశ్విన్ 8వ స్థానం కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ టెస్టులో విఫలమైన సచిన్ రెండు ర్యాంకులు దిగజారి 19వ ర్యాంకుకు పడిపోయాడు.