: ఈనెల 20న రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ప్రారంభించనున్న సోనియా
పేదవారి కోసం కేంద్ర ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ జీవన్ దయాని యోజన' పేరుతో ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకాన్ని ముందుగా ఈ నెల 20న మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. నాగపూర్ లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకానున్నారు. అంతకుముందు అక్కడ నిర్వహించే ర్యాలీలో ఆమె పాల్గొంటారని ఆ రాష్ట్ర మంత్రి శివాజీ రావ్ మోఘే తెలిపారు.