: ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే ధర్నా


తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కోరుకొండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తుపాను బాధితులను వెంటనే ఆదుకోవాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, గృహ రుణాలను ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు విభాగాల అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వంతో పాటు, అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News