: కొంతమంది ఎంపీలనే ఎందుకు పిలిచారు? : బొత్సను ప్రశ్నించిన రేణుకా చౌదరి
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో బొత్స భేటీ అయిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీకి కొంతమంది ఎంపీలనే ఎందుకు పిలిచారు? అని బొత్సను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. దానికి సమాధానంగా... తాను ఎంపీలను పిలవలేదని, కేవలం మంత్రులను మాత్రమే పిలిచానని బొత్స చెప్పారు.