: హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశం
ఈ మధ్యాహ్నం నావికాదళ హెలికాప్టర్ విశాఖపట్టణం వద్ద సముద్రంలో కుప్పకూలిన సంఘటనపై విచారణకు తూర్పు నౌకాదళం ఆదేశించింది. ఐఎన్ఎన్ డేగ నుంచి ఈ చేతక్ హెలికాప్టర్ మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి డాల్ఫిన్ నోస్ కొండ వద్ద సముద్రంలో 10 నాటికల్ మైళ్ల దూరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.