: సవ్యంగా కొనసాగుతున్న 'మార్స్ ఆర్బిటర్' కౌంట్ డౌన్


అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహించేందుకు ప్రయోగించనున్న... 'మార్స్ ఆర్బిటర్' కౌంట్ డౌన్ సవ్యంగా కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం 2.38 గంటలకు పీఎస్ ఎల్ వీ-సీ25 ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రస్తుతం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ రెండో దశకు ఇంధనం నింపే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రయోగ సమయం దగ్గర పడుతుండటంతో, షార్ సమీపంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికితోడు.. బంగాళాఖాతం, పులికాట్ సరస్సుల్లో నావికాదళం భద్రతను పర్యవేక్షిస్తోంది.

  • Loading...

More Telugu News