: ఉద్యోగులు తెలంగాణ వీడాల్సిందే: జీవోఎంకు కేసీఆర్


కేసీఆర్ మరోసారి పాత వివాదాన్ని తట్టి లేపుతున్నారు. ఇంతవరకు సీమాంధ్రులను, ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామన్న కేసీఆర్ అసలు నైజం జీవోఎం ముందు బయట పడింది. రాష్ట్రంలో ఉన్న 8 రాజకీయ పార్టీల నుంచి విభజనపై సూచనలు కోరుతూ జీవోఎం నివేదికలు కోరింది. టీఆర్ఎస్ నేతలు జీవోఎంకు ఇచ్చిన నివేదికల్లో సీమాంధ్రులు దశాబ్ధాలుగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారని అందువల్ల వారందరూ విభజన తరువాత సీమాంధ్రకు తరలివెళ్లాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు గెజిటెడ్ కేటగిరీలో 40 శాతం మంది ఉండగా, నాన్ గెజిటెడ్ కేటగిరీలో 30 శాతం మంది ఉంటారని వారి నివేదికలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ జీవోఎంకు సమర్పించిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్లకు మించి కొనసాగడాన్ని తాము ఒప్పుకోమని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News