: జంట పేలుళ్ల మూలాలు పాక్,దుబాయిలో..!


హైదరాబాద్ జంట పేలుళ్లకు పాకిస్తాన్, దుబాయ్ ల్లో ప్రణాళిక రూపొందించి ఉంటారని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఐదు రోజుల విచారణలో మక్బూల్, ఇమ్రాన్ అందించిన సమాచారం ఏమీ ఉపయోగపడకపోవడం ఎన్ఐఏని నిరుత్సాహానికి గురిచేసింది.

ఈ నేపథ్యంలో ఇండియన్ ముజాహిదిన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ అతని సోదరుడు యాసిన్ భత్కల్ పై అనుమానాలు మరింత ముసురుకుంటున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం పాకిస్తాన్ లో గానీ, దుబాయ్ లోగానీ ఉండొచ్చని కేంద్ర నిఘా వర్గాలంటున్నాయి.

దిల్ సుఖ్ నగర్ పేలుళ్లకు ముందు దుబాయ్ నుంచి హవాలా మార్గంలో హైదరాబాద్ కు భారీగా డబ్బు బదిలీ కావడం ఎన్ఐఏ అనుమానాలను బలపరుస్తోంది. భత్కల్ సోదరులకు దుబాయ్ లో పలు వ్యాపారాలున్నాయి. ఇదిలావుంటే, రియాజ్ భత్కల్ తోపాటు మరికొందరు తీవ్రవాదులు ప్రస్తుతం ఐఎస్ఐ ఆతిథ్యం స్వీకరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 

  • Loading...

More Telugu News