: ముజఫర్ నగర్ బాధితురాలిపై అత్యాచారం


ఆశ్రయం లేక రిలీఫ్ క్యాంప్ లో ఉంటున్న ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ బాధితురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దాదాపు నెల రోజులకు పైగా జొగ్యా కెరి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ లో కొంతమంది బాధితులు ఉంటున్నారు. రెండు రోజుల కిందట (శనివారం) బయటకు వచ్చిన ఇరవై ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. ఆమె తండ్రి వెంటనే ఫిర్యాదు చేయడంతో, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ యువకులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామన్నారు.

  • Loading...

More Telugu News