: అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు వెలవెల
అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రతిష్ఠాత్మకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన మంత్రులు, వ్యవసాయ రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు అంతా కలిసే అపూర్వ వేదిక. అలాంటిది నేటి నుంచి హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో ప్రారంభమైన వ్యవసాయ సదస్సు వెలవెలబోతోంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రతినిధులు హాజరు కాలేదు.
వాస్తవానికి ఈ సదస్సులో ప్రధాని, కేంద్ర వ్యవసాయ మంత్రి, బిల్ గేట్స్ లాంటి ప్రముఖులు పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తీరా వారు రావడం లేదు. 350 మంది విదేశీ ప్రతినిధులకు వచ్చింది 33 మందే. జీవ వైవిధ్య సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రభుత్వం, వ్యవసాయ సదస్సు విషయంలో అంత శ్రద్ధ తీసుకోనట్లు తెలుస్తోంది. కాగా, ఈ సదస్సులో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై నిపుణులు చర్చించనున్నారు.