: గణిత మేధావి శకుంతలాదేవికి గూగుల్ నివాళి


మానవ కంప్యూటర్ గా ఖ్యాతిగాంచిన భారతీయ గణిత మేధావి శకుంతలాదేవికి గూగుల్ డూడుల్ (సెర్చ్ సైట్ లో గూగుల్ లోగో) ద్వారా నివాళి అర్పించింది. గూగుల్ ప్రతి రోజూ ఆ రోజుకే ప్రత్యేకించిన సందర్భాలు, వ్యక్తులను గుర్తు చేస్తూ గూగుల్ అక్షరాలను భిన్నరూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ రోజు శకుంతలాదేవి 84వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ ను నంబర్లలో ప్రదర్శించింది. ఎందుకంటే... ఆమెకు లెక్కలంటే ఇష్టం కనుక. క్లిష్టమైన లెక్కలను సైతం కంప్యూటర్ కంటే వేగంగా గణించి చెప్పడంలో శకుంతలాదేవి దిట్ట. 1982లో ఆమె గిన్నిస్ రికార్డు కూడా సాధించారు.

  • Loading...

More Telugu News