: బొత్సతో భేటీ కానున్న టీ.కాంగ్రెస్ నేతలు
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఈ రోజు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. విభజనకు సంబంధించిన 11 కీలక అంశాలపై అభిప్రాయాలను వెల్లడించడం, కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం, తదితర అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి.