: ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగిన సమాధుల పండుగ
ప్రపంచ వ్యాప్తంగా క్యాధలిక్ మతస్థులు సమాధుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది నవంబర్ 2 న జరిగే సమాధుల పండుగ సందర్భంగా మృతి చెందిన తమ ముందు తరాలను స్మరించుకుని వారి ఆత్మలు దేవుని చెంతకు చేరాలని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ తతంగమంతా వారి సమాధుల వద్దే నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల్లో సమాధుల పండుగ సందర్భంగా క్యాథలిక్కులు సమాధుల వద్ద పుష్పగుఛ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.