: ఈజిప్టులో అమెరికా విదేశాంగశాఖ మంత్రి


అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఈజిప్టులో అమెరికా విదేశాంగశాఖా మంత్రి జాన్ కెర్రీ పర్యటిస్తున్నారు. ఈజిప్టులో ఆ దేశాధ్యక్షుడు మోర్సీని పదవి నుంచి తొలగించిన అనంతరం ఆయన పర్యటించడం ఇదే ప్రధమం. ప్రజల మద్దతుతో ఎన్నికయిన మోర్సీని సైన్యం గద్దె దించడంతో మోర్సీ మద్దతు దారులు, వ్యతిరేకుల మధ్య తీవ్ర అంతర్యుధ్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈజిప్టు పర్యటన అనంతరం కెర్రీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News