: నాలుగు రోజుల్లో 195 బస్సులు సీజ్
ఒక్క ఘటన రవాణాశాఖాధికారుల్లో పెద్దమార్పునే తీసుకొచ్చింది. గత వారం మహబూబ్ నగర్ జిల్లాలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 45 మంది దారుణంగా మృత్యువాత పడడంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో గడచిన నాలుగు రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖ చేసిన తనిఖీల్లో ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన 195 బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి, సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రైవేటు బస్సులపై దాడులు కొనసాగుతాయని, చట్టాలు అతిక్రమించిన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.