: రోహిత్ సిక్సర్ల రికార్డ్


ఏమి, రోహిత్ బ్యాట్ తో బంతిని చంపేశావ్ కదా.. నిన్న మ్యాచ్ చూసిన వారి స్పందన ఇది. ఒక్కో బంతిని బౌండరీల వైపు తరలిస్తూ వీర విన్యాసంతో రోహిత్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. నిన్నటి మ్యాచులో రోహిత్ 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 16 సిక్స్ లు ఉన్నాయి. దీంతో ఒక మ్యాచులో అత్యధిక సిక్స్ లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. షేన్ వాట్సన్ పేరిట ఇప్పటి వరకూ అత్యధిక సిక్సుల(15) రికార్డు ఉంది. అంతేకాదు వన్డేలలో ద్విశతకం చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డేలలో ద్విశతకం చేసిన మరో ఇద్దరు సచిన్(200), సెహ్వాగ్(219) భారత ఆటగాళ్లు కావడం విశేషం.

  • Loading...

More Telugu News