: కొనసాగుతున్న తనిఖీలు.. మరో రెండు బస్సుల సీజ్
రవాణాశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం, తణుకులో బాణాసంచా తరలిస్తున్న కావేరీ కామాక్షి, సాయిరంజన్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ ఉదయం పలు ప్రాంతాలలో నిబంధనలను అతిక్రమించి నడుస్తున్న 26 బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.