: రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
విజయనగరం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. గొట్లాం వద్ద బొకారో ఎక్స్ ప్రెస్ ఎస్-1 బోగీలోంచి పొగలు వస్తున్నాయనే భయంతో ప్రయాణికులు చైన్ లాగి పక్కనున్న రైలు ట్రాక్ ను దాటే ప్రయత్నంలో ఉండగా.. రాయగడ ప్యాసింజర్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లిపోయింది. 8 మంది మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమీపంలోనే మలుపు ఉండడంతో రైలు వస్తున్న విషయాన్ని ప్రయాణికులు తెలుసుకోలేకపోయారని సమాచారం.