: 26 ప్రైవేటు బస్సుల సీజ్
అనుమతులు లేకుండా, నిబంధనలు అతిక్రమించి నడుస్తున్న ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున విజయవాడలో 6, కర్నూలులో ఒకటి, ఏలూరులో 19 బస్సులను సీజ్ చేశారు. ఆదిత్య, కావేరీ, భారతీ, భాను, శాండి, కృష్ణవేణి ట్రావెల్స్ కు చెందిన బస్సులు వీటిలో ఉన్నాయి.