: చాక్లెట్లతో బరువు తగ్గవచ్చు
అదేంటి... చాక్లెట్లు తింటే బరువు పెరుగుతారు కదా... చాక్లెట్లు తింటే బరువు ఎలా తగ్గుతాం? అని మీకు సందేహంగా ఉందా... చాక్లెట్లు మన శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేయడంలో తోడ్పడతాయని, ఫలితంగా మనం బరువు తగ్గడం జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ కేలరీలను కరిగించేందుకు అవసరమైన శరీరంలోని మెటబాలిజమ్‌ను వేగవంతం చేయడంలో చాక్లెట్లు ఎంతైనా ఉపకరిస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది.
స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రనడాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఎక్కువ మోతాదులో చాక్లెట్లు తీసుకున్న వారు తక్కువ కొవ్వు నిల్వలను కలిగివున్నారని, ఇలాంటి వారు చక్కగా ఉత్సాహవంతంగా తమ రోజువారీ పనులను చేసుకోగలుగుతున్నారని తేలింది. చాక్లెట్లు తినని వారితో పోల్చుకుంటే చాక్లెట్లు తిన్నవారు తక్కువ కొవ్వు నిల్వలను కలిగివున్నారని ఈ పరిశోధనలో పాల్గొన్న ఒక శాస్త్రవేత్త చెబుతున్నారు. కాబట్టి చాక్లెట్లు తింటే బరువు పెరుగుతామనే అపోహను వదిలి చక్కగా చాక్లెట్లు తినడం మొదలుపెట్టండి.