: ఆస్ట్రేలియాపై ఇండియా ఘనవిజయం ... సీరీస్ కైవసం
బెంగళూరులో ఈ రోజు జరిగిన వండే ఇంటర్నేషనల్ డే నైట్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. 57 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరపించింది. దీంతో ఏడు వన్డేల సీరీస్ ను 3-2తో భారత్ కైవసం చేసుకుంది. 384 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ 45.1 ఓవర్లలో 326 పరుగులకు ఆలవుటయ్యారు.
ఆసీస్ బ్యాట్స్ మన్ లో ఫాల్క నర్ 116, మాక్స్ వెల్ 60 పరుగులు చేసి, దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. భారత్ బౌలర్ల ముందు చేతులెత్తేయవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచురీ చేసి, భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే!