: టిబెట్ లో దలైలామా గొంతు కూడా వినపడకుండా చేస్తాం : చైనా


బౌద్ధ మత ఆధ్యాత్మిక గురువు దలైలామాను తీవ్రంగా ద్వేషించే చైనా... టిబెట్ లో ఆయన గొంతు కూడా వినపడకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న దలైలామా ఫోటో, వీడియో, ఆడియో... ఏదీ కూడా టిబెట్ లో ఉండకుండా చేసేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్, టీవీ, రేడియోతో పాటు మరే ఇతర మాధ్యమాల ద్వారానైనా సరే ఆయనను వీక్షించకుండా చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ వివరాలను చైనాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు బయటపెట్టారు.

ఇప్పటికే చైనా అనేక ఆంక్షల ద్వారా టిబెట్ లో దలైలామాను చూడకుండా కట్టడి చేసింది. అయితే శాటిలైట్ టీవీల ద్వారా, చైనా ఇంటర్నెట్ విధానంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని దలైలామాకు సంబంధించిన సమాచారాన్ని టిబెటన్లు ఇప్పటికీ పొందుతున్నారు. దీనికి తోడు దలైలామా చిత్రాలు, బోధనలు... టిబెట్ లోకి అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. దీంతో, టిబెట్ పై ఉక్కుపాదం మోపడానికి చైనా సిద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News