: ఆ వీడియో బూటకమంటున్న శ్రీలంక సైన్యం


తమిళ ఈలం ఉద్యమాన్ని అణచేసే క్రమంలో శ్రీలంక సైన్యం సాగించిన అమానవీయకాండను తెలిపే వీడియో ఒకటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంటే.. అదంతా బూటకమని శ్రీలంక సైన్యం చెబుతోంది. ముందు ఎల్టీటీఈలో పనిచేసి తర్వాత తమిళ టీవీ యాంకర్ గా మారిన ఒక యువతిని పట్టుకుని చేతులు వెనక్కు విరిచి, బట్టలు తీసి శ్రీలంక సైనికులు చేసిన దారుణ అత్యాచార కాండ, హత్యను ఆ వీడియో కళ్లకు కడుతోంది.

కాగా, కామన్వెల్త్ సదస్సుకు ముందు తమను అప్రదిష్ట పాల్జేయడంలో భాగమే ఈ వీడియో అని శ్రీలంక సైన్యం ప్రకటించింది. చానల్ 4కు ఇది కొత్త కాదని, ప్రతీ ముఖ్యమైన సందర్భంలోనూ శ్రీలంకకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉందని ఆ దేశ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ రువాన్ వానిగసూర్య అన్నారు. చానల్ 4 చూపిస్తున్న వీడియో కల్పితమని పేర్కొన్నారు. శ్రీలంక సైన్యం దురాగతాలను తెలిపే మూడు వీడియోలను చానల్ 4 గతంలోనూ ప్రసారం చేసింది.

  • Loading...

More Telugu News