: రెండు వికెట్లు కోల్పోయిన భారత్... కోహ్లీ డకౌట్
ఆసీస్ తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. 60 పరుగులు (57 బంతులు, 9 ఫోర్లు) చేసిన ఓపెనర్ ధావన్, డోహర్తి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన కోహ్లీ పరుగులేమీ చేయకుండానే రనౌట్ గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 45 పరుగులు, రైనా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు చిరుజల్లులు పడటంతో ఆటకు కొంత సేపు అంతరాయం కలిగింది.