: భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఒబామా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు, జైన, బౌద్ధ భారతీయులకు అమెరికా అధ్యక్షుడు ఒబామా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపాల వెలుగులు... చీకటిపై విజయాన్ని గుర్తుచేస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనేక జాతుల వారి కలయికతోనే అమెరికా బలపడిందని చెప్పారు. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కలసి దీపావళి జరుపుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఒబామా తెలిపారు.