: ఐసీసీ 'పీపుల్స్ ఛాయిస్ అవార్డు'కి నామినేట్ అయిన ధోనీ, కోహ్లీ
ఈ ఏడాది ఐసీసీ 'పీపుల్స్ ఛాయిస్ అవార్డ్'కి భారత్ నుంచి ధోనీ, కోహ్లీ నామినేట్ అయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ క్లార్క్, ఇంగ్లండ్ కెప్టెన్ కుక్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డీవిలియర్స్ కూడా నామినేట్ అయ్యారు. వీరిలో 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2013'గా ఎవరు నిలుస్తారనే విషయం డిసెంబర్ 13న తెలుస్తుంది. ఈ ఏడాది అవార్డుకు నామినేట్ అయిన ధోనీ, కోహ్లీ ఇద్దరూ కూడా గతంలో ఈ అవార్డును సాధించిన వారే. 2008, 2009 సంవత్సరాలకు గానూ ధోనీ ఈ అవార్డును అందుకున్నాడు. యువ సంచలనం కోహ్లీ 2012 కు గానూ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. విజేతలను క్రికెట్ అభిమానులు www.lgiccawards.com వెబ్ సైట్ నుంచి లేదా ట్విట్టర్ ద్వారా ఓటు వేసి ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ ఈ రోజు ప్రారంభమై నవంబరు 23న ముగుస్తుంది. డిసెంబరు 13న విజేతను ప్రకటిస్తారు.