: బెంగళూరు వన్డేకు భారీ భద్రత


ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య బెంగళూరులో జరుగుతున్న వన్డే మ్యాచ్ సందర్భంగా... చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవల బెంగళూరులో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. స్టేడియం దగ్గర కమెండోలతో పాటు 12 వందల మంది పోలీసులు కూడా మోహరించారు. దీనికి తోడు, వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు 600 మంది కానిస్టేబుళ్లను నియమించారు. స్టేడియం చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని బెంగళూరు అడిషనల్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.

  • Loading...

More Telugu News