: అర్ధ సెంచరీ మార్కు దాటిన భారత్ 52/0
భారత జట్టు చివరి వన్డేను ధాటిగా ఆరంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఇన్నింగ్స్ ను ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ప్రారంభించారు. తొలి రెండు ఓవర్లు కాస్త నెమ్మదించిన ఓపెనర్లు మూడో ఓవర్ నుంచి గేరు మార్చారు. ఆ ఓవర్లో ధావన్ విజ్రుంభించి వరుసగా మూడు ఫోర్లు బాదాడు. తరువాత కూడా ధాటిగా ఆడడంతో 7 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు అర్ధసెంచరీ మార్కు దాటేసింది. టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ధావన్ 27 పరుగులతోనూ, రోహిత్ 17 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లలో టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది.