: ప్రధాని కావాలన్న ఆసక్తి లేదు: రాహుల్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ నేతలందరూ వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతుంటే, సోనియా తనయుడు మాత్రం అందరి ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజల్లో తిరుగుతూ పార్టీని పటిష్టం చేయడమే తనకిష్టమని వెల్లడించారు.
ఇక పార్టీలో వేళ్లూనుకున్న హైకమాండ్ కల్చర్ కు చరమగీతం పాడాలని రాహుల్ ఆకాంక్షించారు. పార్టీని వీడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీపడేవాళ్లకు పార్టీ ద్వారాలు శాశ్వతంగా మూసివేస్తామని ఆయన ఇదివరకు తెలిపారు.