: పయ్యావులపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబుని కోరిన ఎర్రబల్లి
పయ్యావుల కేశవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. దీన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పయ్యావుల కేశవ్ పై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై పయ్యావుల సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ఎర్రబల్లి ఈ విధంగా స్పందించారు.