: విభజన ఏర్పాట్లు చేస్తూ, అఖిలపక్షం అనడం హాస్యాస్పదం: టీడీపీ నేత గద్దె బాబూరావు


కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తూ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడం హస్యాస్పదమని టీడీపీ నేత గద్దె బాబూరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయన మాట్లాడుతూ కేవలం టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం అంటోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేనందున టీడీపీని ఇరకాటంలో పెట్టి లబ్ది పొందుదామని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారే కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News