: అశ్వారావు పేట బాణాసంచా దుకాణంలో భారీ పేలుడు


ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని ఓ బాణాసంచా దుకాణానికి సంబంధించిన గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా... ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉందని తెలుస్తోంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News