: అమెరికా దాడుల్లో పాక్ తాలిబాన్ చీఫ్ 'హకీముల్లా' హతం
కరడుగట్టిన తీవ్రవాది, పాక్ తాలిబాన్ చీఫ్ హకీముల్లా మసూద్... అమెరికా డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. ఈ మేరకు పాక్ మీడియా వార్తలను ప్రసారం చేసింది. పాక్ లోని ఉత్తర వజీరిస్థాన్ లోని దాండే దర్పాఖెల్ ప్రాంతంలోని ఓ ప్రాంగణంలో... తాలిబన్ అగ్రనాయకులు సమావేశమైన సమయంలో అమెరికా దళాలు మిస్సైళ్లతో దాడి చేశాయి. దీంతో, ఆ కాంపౌండ్ మొత్తం ధ్వంసమైంది. ఈ దాడుల్లో హకీముల్లాతో పాటు మరో ఆరుగురు పాక్ తాలిబాన్ అగ్రనాయకులు హతమయ్యారు. హకీముల్లాను పట్టుకోవడానికి అమెరికా దళాలు ఎప్పటి నుంచో నిఘాపెట్టాయి. దీనికోసం, ఓ నిఘా విమానం కన్నేసి ఉంచింది.