: ఎక్కువ కాలం ఇలాంటి మందులను వాడకూడదట


మనకు ఏ కాస్త నొప్పి వచ్చినా వెంటనే మనం నొప్పి నివారణ మందులను వేసుకుంటుంటాం. ఇలా నొప్పి నివారణ మందులను వేసుకోవడం వల్ల కడుపులో మంట వస్తుందని తెలిసినా, నొప్పి తగ్గించుకోవడానికి మందులను వాడుతుంటాం. కానీ ఇలా నొప్పి నివారణ మందులను ఎక్కువ కాలం వాడడం వల్ల మరో సమస్యలను మనం కొని తెచ్చుకుంటున్నాం. ఏమంటే, నొప్పి నివారణ మందులను ఎక్కువగా వాడడం వల్ల మానసికంగా కుంగిపోయే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మందులను ఎక్కువగా వాడడం వల్ల ఇలాంటి కుంగుబాటు సమస్యలు వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 50,000 మందికి ఓపియాయిడ్‌ నొప్పి నివారణ మాత్రలను ఇచ్చి వారిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ మాత్రలను ఎక్కువకాలం వాడిన వారిలో మానసికంగా కుంగిపోయే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా వారిలో కుంగుబాటు కలగడానికి కారణాలు తెలియకపోయినా వారి మెదడులోని రివార్డు పాత్‌వే ను మందు ప్రభావితం చేస్తుండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంగా నొప్పులను తగ్గించుకోవడానికి ఓపియాయిడ్‌ మాత్రలను వాడడం వల్ల అడ్రినల్‌, టెస్టోస్టీరాన్‌, విటమిన్‌ డి, గ్లూకోస్‌ డిస్‌రెగ్యులేషన్‌ వంటి సైడ్‌ ఎఫెక్టుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News