: భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగారం


భార్యను కిరాతకంగా చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ మండలం పులుమామిడికి చెందిన మోత్కుపల్లి అంజయ్య తన భార్య మల్లమ్మపై అనుమానంతో 2011 మే 20న ఉరివేసి అతికిరాతకంగా చంపేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అదనపు జడ్జి ఉదయగౌరి 10 వేల జరిమానాతో యావజ్జీవ కారాగారశిక్ష విధించారు.

  • Loading...

More Telugu News