: ప్రాణం తీసిన టాటూ


ముచ్చటపడి వేయించుకున్న టాటూ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. యువతరం వేలం వెర్రిగా వేయించుకునే టాటూలు వారి ఉన్నతికి ప్రతి బంధకాలుగా మారుతున్నాయి. టాటూలు పిచ్చిగా వేయించుకునే వారిని మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఉద్యోగంలోకి తీసుకోవన్న సంగతి తెలిసిందే. మలేసియాలోని సుంగాయ్ పెటానీలో స్థిరపడ్డ దినేష్ నాయర్(25) అనే భారతీయ సంతతి వ్యక్తికి పోలీసు ఉద్యోగంలో చేరాలని కోరిక. అందుకుతగ్గట్టే అతనికి పోలీసు శాఖ నుంచి ఇంటర్వూ లెటర్ కూడా వచ్చింది. అయితే, ఇంటర్వ్యూలో అతని టాటూ ఉద్యోగానికి ప్రతి బంధకంగా మారింది. దీంతో, దాన్ని తొలగించుకునేందుకు ఓ ప్రైవేటు క్లినిక్ ను అతను సంప్రదించాడు. చికిత్స క్రమంలో దినేష్ కోమాలోకి వెళ్లాడు. తరువాత మృతి చెందాడు. దీంతో, అతని కుటుంబీకులు క్లినిక్ పై కేసు పెట్టారు.

  • Loading...

More Telugu News