: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అరెస్టు
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. మాలే లోని ఆయన నివాసం వద్దే నషీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నషీద్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్థానిక క్రిమినల్ కోర్టు జడ్జి అబ్దుల్లా మహ్మద్ ను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయనపై రెండుసార్లు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.
అయినా కోర్టు ఎదుట హాజరుకాకుండా మాల్దీవుల్లోని భారత రాయబార కార్యాలయంలో 11 రోజులు నషీద్ ఆశ్రయం పొందారు. తిరిగి ఫిబ్రవరి 23న కార్యాలయం నుంచి ఆయనే బయటకు వచ్చారు. పైగా, తనను అరెస్ట్ చేస్తే భారత్ జోక్యం చేసుకోవాలని ఆయన ఇటీవలే అర్థించిన సంగతి తెలిసిందే.