: బస్సుల్లో పొగలు.. ప్రయాణికులు సురక్షితం
బస్సు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన దగ్గర్నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పొగలు వచ్చాయి. విషయం గమనించిన డ్రైవర్ బస్సు నిలిపివేసి ప్రయాణికులను దించివేశాడు.
మరో ఘటనలో, నల్గొండ జిల్లా నూతన్ కల్ మండలం గుండ్లసింగారం వద్ద ఆర్టీసీ బస్సులోంచి అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణీకులను దించివేశాడు. సెల్ఫ్ మోటార్ కాలిపోవడంతో పొగలు కమ్ముకున్నాయి. విషయాన్ని అధికారులకు సమాచారమందించి, ప్రయాణికులను దించివేశారు.