: పట్టభద్రుడి వేషంలో గొర్రెలు మేపిన భూమన కరుణాకర్ రెడ్డి
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు మరో వేషంలో నిరసన తెలిపారు. పట్టభద్రుల కోటు, టోపీ ధరించి ఆయన గొర్రెలు మేపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని పట్టభద్రులకు గొర్రెలు మేపుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఉద్యోగావకాశాలకు నిలయమైన హైదరాబాదును కోల్పోతే సీమాంధ్ర విద్యార్థులకు మిగిలేది నిరుద్యోగమేనని భూమన వెల్లడించారు.