: ధరలను నియంత్రించడంలో యూపీఏ విఫలం: మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ యూపీఏ-2 ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ధరలను నియంత్రించడంలో యూపీఏ విఫలమైందన్నారు. ధరల పెరుగుదల అంశంలో యూపీఏ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ ఉన్నా సుపరిపాలన అందిస్తుందని.. ఎన్డీఏ పాలనలో ధరల నియంత్రణకు నిత్యం కృషి జరిగేదని చెప్పారు. వాజ్ పేయి, మొరార్జీ దేశాయ్ పాలనలో ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపేవారన్నారు. వందరోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన యూపీఏ.. వంద నెలల తర్వాత కూడా ఆ పని చేయలేకపోయిందని మోడీ ఎద్దేవా చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో కూడా యూపీఏ విఫలమైందని పుణెలో వ్యాఖ్యానించారు. తనను కోర్టు కేసుల్లో ఇరికించాలని యూపీఏ ప్రయత్నించిందని అన్న మోడీ, తనను ఇప్పుడు ఏమీ చేయలేకే.. వ్యక్తిగత విమర్శలకు దిగుతోందన్నారు. ప్రజల మద్దతు వల్లే కాంగ్రెస్ కుట్రల నుంచి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు.