: ముజఫర్ నగర్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు
మత ఘర్షణలతో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఘర్షణలతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి జిల్లాలోని కుత్బా ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి పోలీసులు వచ్చారు. నిందితుని కోసం పోలీసులు వెతుకుతుండగా గ్రామస్తులు వారిపైకి రాళ్లు విసిరారు. దీంతో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.