: గాదెకు, నాకు మధ్య విభేదాల్లేవు: పనబాక లక్ష్మి
ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డికి, తనకు మధ్య విభేదాలు లేవని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. బాపట్లలో ఆమె మాట్లాడుతూ, 80 కోట్ల రూపాయల వ్యయంతో చీరాల భట్టిప్రోలులో ఏర్పాటు చేయనున్న మెగా చేనేత భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఎంపీ ల్యాండ్స్ తో చేపడుతున్న అభివృద్ధి పనులను కొందరు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.