: తమిళనాడు ప్రభుత్వ ముద్రణాలయంలో భారీ అగ్నిప్రమాదం


చెన్నైలోని మింట్ స్ట్రీట్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణాలయంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ముద్రణాలయంలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. 10 అగ్నిమాపక శకటాలు మంటలార్పేందుకు ప్రయత్నించాయి. అయితే, ప్రమాదం జరిగిన చాలా సేపటి తర్వాత ఇవి రావడంతో అప్పటికే పెద్ద నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సమాచారం, పుస్తకాలు, ప్రచురణలను ఇక్కడ ముద్రిస్తారు.

  • Loading...

More Telugu News