: బహిరంగ చర్చకు సిద్ధం.. మోడీకి సిబాల్ ఛాలెంజ్
గత పదేళ్లుగా దేశాన్ని కాంగ్రెస్ భ్రష్టుపట్టించిందని, అభివృద్ధి చేయలేకపోయిందని, దేశంలో పలు సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మోడీ చేసిన వ్యాఖ్యలు ఒట్టి ఆరోపణలేనని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ కొట్టిపారేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రతి సభలోనూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలన్నీ తప్పని అన్నారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందనే దానిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కపిల్ సిబాల్.. మోడీకి సవాలు విసిరారు.