: ధోనీ కొత్త రికార్డు
వరుసగా రెండు విజయాలలో ఊపుమీదున్న టీమిండియా కెప్టెన్ ధోనీ టెస్టుల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత కెప్టెన్ గా సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. హైదరాబాద్ టెస్టులో ఆసీస్ పై విజయం కెప్టెన్ గా ధోనీకి 22వది.
ఇప్పటివరకు మాజీ సారథి సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా 21 టెస్టు విజయాలు అందుకుని అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా ఘనవిజయంతో ధోనీ.. గంగూలీని వెనక్కినెట్టాడు. ధోనీ మొత్తం 45 టెస్టుల్లో సారథ్యం వహించగా, భారత్ 22 టెస్టుల్లో నెగ్గింది. మరో 12 టెస్టుల్లో ఓటమిపాలవగా, 11 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.