: స్కూల్ టీచర్ పై లైంగిక వేధింపులు.. వంటికి నిప్పు
27 ఏళ్ల టీచర్ పై స్కూల్ ఇన్ స్పెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా తనపై ఫిర్యాదు వెనక్కి తీసుకోనందుకు ఆమె ఒంటికి నిప్పంటించాడు. ఒడిశాలోని రాయగఢ జిల్లాలో ఇది జరిగింది. ప్రస్తుతం ఆ టీచర్ 90 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితులలో విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడైన స్కూల్ ఇన్ స్పెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధిత టీచర్ మూడు నెలల కిందటే స్కూల్ ఇన్ స్పెక్టర్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, నేటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ లోపు తనపై కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఆ ఇన్ స్పెక్టర్ టీచర్ ను వేధించడం మొదలుపెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో, ఆమె హాస్టల్లో ఉన్న సమయంలో టీచర్ ఒంటికి నిప్పంటించాడు. దీనిపై స్పందించిన ప్రభుత్వం నిందితుడితోపాటు, జిల్లా స్కూళ్ల ఇన్ స్పెక్టర్, ఎస్ఐలను సస్పెండ్ చేసింది.