: పటేల్ గౌరవార్థం.. నాలుగేళ్లలో రూ. 8.5 కోట్లు ఖర్చు
సర్ధార్ వల్లభాయ్ పటేల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. పటేల్ లౌకికవాది అని, ఆయన పూర్తిగా కాంగ్రెస్ వ్యక్తి అని ప్రధాని పేర్కొనగా.. పటేల్ ను తమవాడిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆయనను ఎందుకు మర్చిపోయిందని మోడీ నిలదీశారు. అంతేకాదు, పటేల్ ను ఒక పార్టీ వాడిగా చెప్పడం సరికాదన్నారు. దీంతో, పటేల్ ను కాంగ్రెస్ మర్చిపోయిందన్న మోడీ వ్యాఖ్యలు తప్పంటూ, పటేల్ జయంతి సందర్భంగా గత నాలుగేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 8.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటూ డైరక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను విడుదల చేసింది.