: రోడ్డు ప్రమాదంలో మోడీ భద్రతా సిబ్బంది మృతి


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భద్రతా సిబ్బంది ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బందితో కూడిన వాహనం బీహార్ రాజధాని పాట్నాకు వెళుతుండగా.. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న ట్రక్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో, బాంబు నిర్వీర్యక దళానికి చెందిన భిలాయ్(30), జైరామ్(30) అక్కడికక్కడే మరణించారు. అక్టోబర్ 27న పాట్నాలో హుంకార్ సభ సందర్భంగా జరిగిన పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మోడీ రేపు పరామర్శించనున్నారు. ముందస్తు భద్రతా ఏర్పాట్ల పరిశీలన కోసం వీరు పాట్నా వెళుతున్నారు.

  • Loading...

More Telugu News