: సీఎం కిరణ్ తో సౌదీ బృందం భేటీ
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో సౌదీ అరేబియా బృందం నేడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని ఆ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్నఅబ్దుల్ రెహ్మాన్ తెలిపారు. ఈరోజు ఉదయం సీఎంతో సమావేశమైన వారు తమ దేశంలో పెట్టుబడులు పెట్టండంటూ రాష్ట్ర పారిశ్రామికవేత్తలను కోరారు. అంతేగాకుండా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో కలిసి తమ దేశం రండంటూ సౌదీ ప్రతినిధులు సీఎం కిరణ్ ను ఆహ్వానించారు.