: సచిన్ 200వ టెస్టుపై పోస్టల్ స్టాంపు
సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో ఆ దిగ్గజ బ్యాట్స్ మన్ గౌరవార్థం ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయాలని నిర్ణయించింది. సచిన్ 200వ టెస్టు సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేస్తారు. ఈ ప్రత్యేక స్టాంపుపై సచిన్ ముఖచిత్రం ముద్రించి ఉంటుంది. ఈ నెల 14 నుంచి జరిగే ఆ టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్టాంపును ఆవిష్కరిస్తారు. దాంతోపాటే, సచిన్ వివరాలతో రూపొందించిన 64 పేజీల బ్రోచర్ ను కూడా ఎంసీఏ తీసుకురానుంది.